పసికందుపై ఇటుకలు పేర్చి క్రూరంగా వదిలేసిన వైనంపై కలకలం
రిపోర్టర్: సునీల్
స్థలం: సీతంపేట
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దారపాడులో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. పసికందుపై ఇటుకలు పేర్చి వెళ్లడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. వాలీబాల్ ఆడుతుండగా బంతి వెళ్లడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. శరీరంపై గాయాలతో ఉన్న శిశువును దోనుబాయి పీహెచ్సీకి, అనంతరం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఐసీడీఎస్, శిశు సంరక్షణ అధికారులు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. పూర్తిగా కోలుకున్నాక చిన్నారిని పార్వతీపురం శిశుగృహానికి అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.