రాయలసీమ పురపోరులో ఉద్రిక్తతలు: ఘర్షణలు, దాడులతో పలుచోట్ల గందరగోళం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అనంతపురం
రాయలసీమలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్ లో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ శ్రేణుల పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతపురంలో పోలింగ్ కేంద్రాలను ధ్వసం చేయడం, కుర్చీలు విసిరేయడం వంటి ఘటనలతో పోలింగ్ కాసేపు నిలిచిపోయింది. ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. అయితే మిగతా ప్రాంతాల్ లో ఎన్నికలు ప్రశాంతంగా సాగాయని, ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు.