కూచ్ బెహర్ లో దారుణం: భర్తపై దాడిని అడ్డుకున్న గర్భిణికి షాక్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Cooch Behar
పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తపై దాడిని అడ్డుకోబోయిన ఎనిమిది నెలల గర్భిణిపై దుండగులు దాడి చేయడంతో ఆమె మృత శిశువుకు జన్మనిచ్చినట్లు పోలీసులు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుడైన దేబాజిత్ బర్మన్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని బాధితుడి కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు అధికారులు స్పష్టం చేశారు.