అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి విడతలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Andhra Pradesh

అగ్రిగోల్డ్ సంస్థలో పూర్తి డబ్బు చెల్లించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న బాధితులకు మొదటి విడతలో న్యాయం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల నుంచి బాండ్లు సేకరించేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితులు తమ బాండ్ల జిరాక్స్ కాపీలను ఈ ప్రత్యేక బృందాలకు అందజేయాలని సూచించారు. అలాగే 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి వీటిని తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.