షాకింగ్ ఘటన: మ్యాచ్ లో తీవ్ర గాయంతో టెనెరిఫె స్ట్రైకర్ మృతి
రిపోర్టర్: శివ
స్థలం: Madrid
స్పానిష్ ఫుట్బాల్ క్లబ్ టెనెరిఫె స్ట్రైకర్ జీసస్ డి మిగ్యుల్ మ్యాచ్ లో గోల్ కీపర్ తో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు క్లబ్ వర్గాలు వెల్లడించాయి. ఎఫ్సీ ఆండోరా జట్టుతో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి గోల్ కీపర్ జీసస్ ఓవోనోతో ఢీకొనడంతో అతను మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ విషాదకర ఘటనతో ఫుట్బాల్ వర్గాల్ లో తీవ్ర విషాదం అలుముకుంది.