వైసీపీ వీడతానన్న ప్రచారాన్ని ఖండించిన బొత్స సత్యనారాయణ
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
వైసీపీని వీడి జనసేనలో చేరుతారన్న ప్రచారంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. తాను పార్టీ మారుతున్నానన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. విజయసాయిరెడ్డి ఖాళీగా ఉండి ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించిన బొత్స, తన కుమార్తె అనూషను విజయనగరం జడ్పీ ఛైర్మన్ బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ మార్పు ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.