జేమ్స్ బాండ్ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు కల్లమ్ టర్నర్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ప్రసిద్ధ జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ పాత్రలో హాలీవుడ్ నటుడు కల్లమ్ టర్నర్ నటించనున్నట్లు ప్రముఖ విశ్లేషకులు రోజర్ ఫ్రైడ్మన్ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక పాత్ర కోసం కల్లమ్ టర్నర్ ఎంపికైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని సినీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆయన రాబోయే చిత్రాల షెడ్యూల్ కూడా ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది.