డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఎంట్రీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ తనదైన మాస్ ఎంట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చాలా రోజుల తర్వాత బహిరంగ వేదికపై కనిపించిన తారక్ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.