ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 16 డిజైన్ మరియు ఫీచర్లు వెల్లడి

రిపోర్టర్: సతీష్ స్థలం: China

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన వన్‌ప్లస్ 16 డిజైన్, కలర్ ఆప్షన్లు మరియు స్టోరేజ్ వేరియంట్లను అధికారికంగా చైనాలో వెల్లడించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుండగా, నాలుగు మెమరీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో గరిష్టంగా 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉండగా, ఫోన్ లాంచ్ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.