నన్ను ఫేక్ అంటావా అంటూ జగన్‌పై శివనాగిరెడ్డి ఫైర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
ఏషియన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తనను ఫేక్ అంటారా అంటూ శివనాగిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వమే తన క్రీడా ప్రతిభను గుర్తించి రైల్వే మరియు ఇన్ కం టాక్స్ శాఖలలో ఉద్యోగం ఇచ్చిందని గుర్తుచేశారు. క్రీడాకారులను అవమానిస్తే తగిన గుణపాఠం చెబుతామని, జగన్‌కు వక్రబుద్ధి ఎందుకని ఆయన నిలదీశారు.