దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించిన పామూరు బిజెపి నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పామూరు
పామూరులోని మండల బిజెపి కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. అంత్యోదయ సిద్ధాంతం ద్వారా దేశానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.