గణేష్ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి: ఎస్సై నరేందర్ రెడ్డి

రిపోర్టర్: అశోక్ స్థలం: మహబూబ్ నగర్

బాలానగర్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పోలీస్ అనుమతులు పొందాలని ఎస్సై నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.