రేవంత్ రెడ్డి భూముల గురించే ఆలోచిస్తున్నారు: హరీశ్ రావు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం భూముల గురించే ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారారని ఆరోపించారు. ఒక్క కలం పోటుతో గ్రామాలకు గ్రామాలను 22ఏ నిషేదిత జాబితాలో పెట్టి ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.