నేటి పిల్లల్లో తగ్గుతున్న మేధో సామర్థ్యం: సంచలనం రేపుతున్న నిపుణుల హెచ్చరిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
నేటి తరాల పిల్లలు గతంతో పోలిస్తే తక్కువ మేధో సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ప్రముఖ నాడీ శాస్త్రవేత్త డాక్టర్ జారెడ్ కూనీ హార్వత్ అమెరికా సెనేట్‌కు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. డిజిటల్ పరికరాల అధిక వాడకం వల్ల విద్యార్థులలో అక్షరాస్యత, గణిత నైపుణ్యాలు, ఏకాగ్రత గణనీయంగా మందగించాయని ఆయన పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా విద్యా రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది.