గుర్వాయిగుడెంలో టోర్నడో బీభత్సం పంట తోటలకు తీవ్ర నష్టం
రిపోర్టర్: గోపి
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్వాయిగుడెంలో అకస్మాత్తుగా వీచిన టోర్నడో తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా మామిడి, జీడి, పత్తి, పామాయిల్ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన గాలులకు భారీ చెట్లు నేలకొరిగాయి. చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో తాము రోడ్డున పడ్డామని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు తీవ్రంగా కోరుతున్నారు.