మెట్రో కారిడార్లో సమగ్ర మొబిలిటీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని జయేష్ రంజన్ ఆదేశం

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

తెలంగాణలోని జేఎన్టీయూ–మియాపూర్–రాయదుర్గ్ మెట్రో కారిడార్లో ప్రయాణికులు, పాదచారులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేలా సమగ్ర మొబిలిటీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధికారులను ఆదేశించారు. సీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, లాస్ట్-మైల్ కనెక్టివిటీ, ఫీడర్ ఆటోల ఏర్పాటు మరియు పాఠశాలల వద్ద ప్రత్యేక పికప్-డ్రాప్ ప్రాంతాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.