ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలని ఏసీబీ పిటిషన్

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీ రామారావు పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ నిధుల మళ్లింపు ఆరోపణలపై దర్యాప్తు వేగవంతం చేసిన ఏసీబీ, కేటీఆర్తో పాటు మరో ముగ్గురు అధికారుల పాస్పోర్ట్లను జప్తు చేయాలని కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.