గోల్కొండలో ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ ముగింపు: డిప్యూటీ సీఎం భట్టితో మంత్రి కోమటిరెడ్డి హాజరు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నల్గొండ
గోల్కొండ కోట సమీపంలో జరిగిన ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, హెచ్జీఏ కోసం పదహారు ఎకరాల కేటాయింపుతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.