'భారత్-రష్యా సంబంధాల బలపడటంలో మీ పాత్ర కీలకం': ప్రధాని మోదీకి పుతిన్ శుభాకాంక్షలు

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపడటంలో ప్రధాని మోదీ వ్యక్తిగత కృషి ఎంతో కీలకమని పుతిన్ కొనియాడారు. న్యూఢిల్లీలో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా తనకు, రష్యా ప్రతినిధి బృందానికి అందించిన ఆతిథ్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలపై పరస్పర సహకారాన్ని కొనసాగిస్తామని పుతిన్ స్పష్టం చేశారు.