కల్కి 2 లో దీపికా పదుకొణె నటించరని స్పష్టం చేసిన నాగ్ అశ్విన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
కల్కి 2898 ఏడీ చిత్రంలో కీలకమైన సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొణె సీక్వెల్లో కనిపించరని, ఆమె స్థానంలో మరో నటిని తీసుకోబోమని దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థతో కుదిరిన పరస్పర అంగీకారంతో ఆమె తప్పుకున్నట్లు తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మధ్య నుంచి ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు.