విజయనగరం పీటీసీలో ఘనంగా మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పెరేడ్

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు పాల్గొని మహిళా పోలీసులను అభినందించారు.