రష్యా డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ భారీ సైబర్ దాడులు

రిపోర్టర్: నరేష్ స్థలం: Moscow

రష్యాలోని కీలక డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ గత రెండు వారాలుగా తీవ్రస్థాయిలో దాడులు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. యాండెక్స్, స్బెర్బ్యాంక్, వీకే సంస్థల డేటా సెంటర్లు తీవ్రంగా దెబ్బతినడంతో రష్యాలో పబ్లిక్ లైఫ్ అస్తవ్యస్తమైందని పేర్కొన్నారు. రష్యా గతంలో చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఉక్రెయిన్ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ పరిణామంతో రష్యన్ పౌరులు రోజువారీ సేవలు నిలిచిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారని వారు వెల్లడించారు.