ఓటర్లకు ఎన్నికల సంఘం భారీ ఊరట: జాబితాలో పేర్లకు మరో అవకాశం

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన లేదా గైర్హాజరైనట్లు గుర్తించబడిన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఏడు రాష్ట్రాల్ లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పేర్లు గల్లంతైన వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం స్పష్టం చేశారు. ఫారాలు సమర్పించని వారు తగిన వివరణతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.