గగనతలంలో తీవ్ర కలకలం: జైపూర్లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
రిపోర్టర్: నరేష్
స్థలం: Jaipur
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో గగనతలంలో తీవ్ర కలకలం రేగింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగి విమానాన్ని తనిఖీ చేస్తున్నాయని, ఇది నకిలీ బెదిరింపా లేక నిజమైనదా అన్న కోణంలో అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారని తెలిపారు.