ఇందిరమ్మ ఇళ్ల ఈఎండీ వాపసు ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
లాటరీలో ఇందిరమ్మ ఇళ్లు రాని దరఖాస్తుదారులకు ఈఎండీ వాపసు ప్రక్రియను హౌసింగ్ బోర్డు ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో చెల్లించిన వారికి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమకానుండగా, నగదు రూపంలో చెల్లించిన వారు సెప్టెంబర్ 10లోగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వైస్ చైర్మన్ వి.పి.గౌతమ్ వెల్లడించారు. అలాగే పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.