జేఎన్టీయూ సుల్తాన్పూర్లో ర్యాగింగ్ కలకలం జాతీయ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల పరిధిలోని జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్లో ర్యాగింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బీటెక్ విద్యార్థిపై సీనియర్లు వేధింపులకు పాల్పడటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్లు, బాధిత విద్యార్థికి మద్దతుగా 161 జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గంటపాటు ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన యాజమాన్యం ఇద్దరు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.