'గజం భూమి కూడా వదలం..': అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22ఏ నిషేధిత భూముల అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో కోటి రెండు లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని స్పష్టం చేసిన ఆయన, గత బీఆర్ఎస్ పాలనలోనే ధరణి పోర్టల్ ఆసరాగా అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ సహా అన్ని అక్రమాలపై విచారణ జరిపి ఒక్క ఇంచు భూమిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.