'డిజిటల్ పంటల సర్వేను వెంటనే పూర్తి చేయాలి': కలెక్టర్ కోయ శ్రీహర్ష
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన డిజిటల్ పంటల సర్వేను వేగవంతం చేసి ఈ నెల 30వ తేదీలోగా నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్వే వివరాలు నమోదు కాకపోవడం వల్ల సన్న రకం ధాన్యం పండించే ఏ ఒక్క రైతు ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోల్పోకూడదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి జాప్యానికి తావులేకుండా సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన సూచించారు.