హైదరాబాద్లో అరుదైన నిర్ణయం: ఎనిమిది వందల మామిడి చెట్ల తరలింపు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం రోడ్డు నిర్మాణంలో భాగంగా తొలగించాల్సిన ఎనిమిది వందల మామిడి చెట్లను కాపాడేందుకు డెవలపర్ అశ్విన్ రావు వినూత్న ప్రయత్నం చేశారని, వేరే భూమిని కొనుగోలు చేసి వాటిని సురక్షితంగా తరలించారని వాతా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.