తమిళనాడులో నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి
రిపోర్టర్: మహేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని వెల్లూరు జిల్లా కాట్పాడి సమీపంలో నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు స్లాబ్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాంక్రీట్ వేస్తున్న సమయంలో స్కాఫోల్డింగ్ బరువును తట్టుకోలేక కుప్పకూలింది. క్షతగాత్రులను వెల్లూరు, చిత్తూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.