విజయవాడలో అభిమాని ఫాస్ట్ఫుడ్ సెంటర్ను సందర్శించి సర్ప్రైజ్ ఇచ్చిన సోనూ సూద్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయవాడ
ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడూ సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ విజయవాడ నగరంలో మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తనపై ఉన్న అభిమానంతో ఓ యువకుడు తన ఫాస్ట్ఫుడ్ సెంటర్కు సోనూ సూద్ పేరు పెట్టుకోగా, విషయం తెలుసుకున్న ఆయన ఎలాంటి గర్వం లేకుండా స్వయంగా అక్కడికి వెళ్లి అభిమానికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్ను సందర్శించి యజమానితో ముచ్చటించి, రుచి చూస్తూ ఫోటోలు దిగడంతో స్థానికులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.