బ్లడ్ బ్యాంకుపై వస్తున్న విమర్శలను ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టించుకోనని స్పష్టం చేసిన మెగాస్టార్ చిరంజీవి

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంకుపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై మెగా యూత్ ఫోర్స్ సమావేశంలో తీవ్రంగా స్పందించారు. తాను ఎక్కడా విరాళాలు తీసుకోకుండా తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంకు నడుపుతున్నానని, తనకు వచ్చే రెమ్యూనరేషన్‌తో పోలిస్తే రక్తం అమ్మడం ఎంత మూర్ఖపు ఆలోచనో అర్థం చేసుకోవాలని మండిపడ్డారు. విమర్శలను పట్టించుకోకుండా తన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.