పేదల ఇళ్లకు శాశ్వత భరోసా కల్పించామన్న చంద్రబాబు
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh
సొంతిల్లు ఉండాలనే ప్రతి మనిషి కల సాకారానికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దశాబ్దాల కష్టాలు, అనిశ్చితికి నేటి పట్టాభిషేకంతో ముగింపు పలికాం అని ఆయన పేర్కొన్నారు. పేదల ఇళ్లపై ఇక ఎలాంటి వివాదం లేదని, భయం లేకుండా తిరుగులేని హక్కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.