మర్రిపాడు మండలంలో రెండవ రోజు ఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండలం పరిధిలోని పదమూడు ఎంపీటీసీ స్థానాలకు రెండవ రోజు ఎనిమిది నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. తొలి రోజు రెండు నామినేషన్లు రాగా నేటితో కలిపి మొత్తం ముప్పై దరఖాస్తులు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో వివిధ పార్టీల అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నామినేషన్లను అధికారులకు సమర్పించారు.