అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర ఉద్రిక్తత: సియాంగ్ లోయలో భారీగా బలగాల మోహరింపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Arunachal Pradesh
అరుణాచల్ ప్రదేశ్లో ప్రతిపాదిత మెగా జలవిద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సియాంగ్ లోయ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. హింసాత్మక ఆందోళనలు చెలరేగడంతో పాసిఘాట్కు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రప్పించారు. పలు జిల్లాల్లో ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టడంతో పాటు కార్యాలయాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తూ విస్తృతంగా పోలీసు తనిఖీలు నిర్వహిస్తున్నారు.