తుఫాన్ వర్షాల నేపథ్యంలో గన్నవరం పరిస్థితిపై ఎమ్మెల్యే యార్లగడ్డ పర్యవేక్షణ
రిపోర్టర్: విజయ్
స్థలం: కృష్ణా
తుఫాన్ ప్రభావంతో గన్నవరం నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రెండు రోజుల పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని యార్లగడ్డ వెంకట్రావు - ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెల్లడించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిందా లేదా రహదారులపై రాకపోకలకు ఏమైనా అంతరాయం ఏర్పడిందా అనే అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.