యూట్యూబ్ చూసి గోల్డ్మైన్లోకి దిగిన వ్యక్తి: రామగిరి సొరంగంలో చిక్కుకుని ప్రాణాపాయం
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీసత్యసాయి జిల్లా
యూట్యూబ్లో వీడియో చూసి బంగారం వేట కోసం శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలోని పాత సొరంగంలోకి దిగిన నెల్లూరు జిల్లా వాసి ప్రభాకరరెడ్డి గాలి ఆడక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. బయట ఉన్న మిత్రుడు కిష్టయ్య సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రాత్రికి రాత్రే సాహసోపేతంగా స్పందించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ప్రమాదకర సాహసాలకు పాల్పడవద్దని హెచ్చరించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసినట్లు అధికారులు వెల్లడించారు.