తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లా జలాశయాల్లో పెరుగుతున్న వరద నీరు

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

తుపాను ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని తాటిపూడితో పాటు పలు జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గతంలో కళ తప్పిన రిజర్వాయర్లు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటుండటంతో అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తాగునీటితో పాటు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తుండగా మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.