బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్కు బీఎంసీ అధికారులు నోటీసులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబయి

బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవ్గణ్కు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయనకు చెందిన జుహు బంగ్లాలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే సెలూన్, స్పా నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. హౌసింగ్ సొసైటీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు బీఎంసీ స్పష్టం చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ స్థలాన్ని ఉపయోగించడానికి అనుమతులు లేవని అధికారులు వెల్లడించారు.