మురసు తుపాను నష్టం: యుద్ధప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ చేపట్టాలని మంత్రి ఆదేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Amaravati
మురసు తుపాను దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. తాత్కాలిక మరియు శాశ్వత మరమ్మతుల కోసం భారీగా నిధులు అవసరమని ఆయన తెలిపారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.