డీజే భారీ శబ్దాలతో గుండెపోటు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

గణేష్ నిమజ్జనాలు, వివాహ వేడుకల్లో వినియోగిస్తున్న డీజే శబ్దాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిమ్స్ హృద్రోగ నిపుణులు డాక్టర్ సాయి సతీశ్ వివరాల ప్రకారం, 100 నుండి 120 డెసిబెల్స్ వరకు ఉండే ఈ భారీ శబ్దాలు చెవి వినికిడి శక్తిని దెబ్బతీయడంతో పాటు ప్రాణాంతకమైన కార్డియాక్ అరెస్టుకు దారితీస్తున్నాయి. అధిక శబ్దాల వల్ల శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ హఠాత్తుగా విడుదలై గుండె వేగాన్ని పెంచడం వల్ల గతంలో పలువురు మరణించినట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.