పేదలకు ఇళ్లస్థలాలు: నవంబరు నుంచి భారీ భూసేకరణకు రెవెన్యూ శాఖ సిద్ధం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఇంటిస్థలం లేని పేదల కోసం ప్రభుత్వం నవంబరు నుంచి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. అర్హులైన 1,24,873 మందికి కొత్తగా స్థలాలు కేటాయించేందుకు 4,800 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాల పంపిణీకి రూ.1,800 కోట్లు కేటాయించనున్నారు. వైకాపా హయాంలో అనర్హులకు ఇచ్చిన 43,498 పట్టాలను రద్దు చేసి, అర్హులైన పేదలందరికీ పారదర్శకంగా ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు.