గుంటూరులో విద్యార్థుల అపూర్వ ఘనత.. వరల్డ్ రికార్డులో స్థానం
రిపోర్టర్: నరేష్
స్థలం: గుంటూరు
గుంటూరులో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా విద్యార్థులు ఏకకాలంలో 25 వేల మట్టి గణపతి ప్రతిమలు తయారు చేసి అరుదైన రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో 55 పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మట్టి విగ్రహాలను రూపొందించారు. విద్యార్థుల ఈ ప్రతిభను పరిశీలించిన 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు' బృందం ఈ విన్మయకరమైన ఘనతను అధికారిక రికార్డుల్లో నమోదు చేసి నిర్వాహకులకు ధ్రువపత్రం అందజేసింది.