జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో భారీ అవినీతి: ఏసీబీని ఆశ్రయించిన బాధితులు
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో అక్రమాలు తారాస్థాయికి చేరాయని బాధిత కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో ఏండ్లుగా తిష్ట వేసిన మహిళా అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్నారని వారు వాపోయారు. కమీషన్లు ఇచ్చుకున్న వారికే పనులు అప్పగిస్తూ బిల్లుల చెల్లింపుల్లోనూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోరుతూ బాధితులు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు.