ప్రాదేశిక ఎన్నికల్ లో రిగ్గింగ్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నిప్పులు
రిపోర్టర్: మహేష్
స్థలం: పల్నాడు
ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు అధికార బలంతో దౌర్జన్యాలు, బూత్‌ల ఆక్రమణలకు పాల్పడ్డారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. రిగ్గింగ్ కు పాల్పడిన ప్రాంతాల్ లో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంతో పాటు నకరికల్లులో అధికార పార్టీ కార్యకర్తలు బూత్‌లలోకి ప్రవేశించి, ప్రతిపక్షాల ఏజెంట్లను బలవంతంగా బయటకు తరిమేశారని, దొంగ ఓట్లతో రిగ్గింగ్ కు పాల్పడ్డారని సీపీఎం నేత వి.శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.