ఎవరెస్ట్ సమీపంలో హెలికాప్టర్ల ఢీ: విదేశీ పర్యాటకుడు మృతి చెందగా ఇద్దరికి గాయాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Nepal
నేపాల్ లోని ఎవరెస్ట్ బేస్ క్యాప్ సమీపంలో ల్యాండింగ్ చేస్తుండగా రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో ఒక విదేశీ పర్యాటకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఫెరిచే గ్రామం వద్ద ఫిష్ టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనస్టీ హెలికాప్టర్లు ఒకే చోట దిగడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం లుక్లా ప్రాంతానికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.