టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: ఐకూ ఫోన్లలో ఆండ్రాయిడ్ అప్డేట్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఐకూ ఇండియా సీఈఓ నిపుణ్ మర్య అప్డేట్ వివరాలను వెల్లడించారు. ఈనెలలో ఐకూ 15 మోడల్తో మొదలై వివిధ దశల్లో ఆండ్రాయిడ్ ఆధారిత ఓరిజిన్ ఓఎస్ 7 అప్డేట్ విడుదల కానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కంపెనీ నంబర్, నియో, జెడ్ సిరీస్ ఫోన్లకు రాబోయే నెలల్లో ఈ అప్డేట్ అందుబాటులోకి రానుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు ఫీచర్లతో పాటు అనేక నూతన సదుపాయాలు ఫోన్లలో లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.