వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న తు హి రే దిల్ మైన్ సీరియల్

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

ప్రముఖ టెలివిజన్ ధారావాహిక తు హి రే దిల్ మైన్ విజయవంతంగా వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకుని ప్రత్యేక మైలురాయిని చేరుకుంది. సంజయ్, స్వాతి, వృంద పాత్రల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని నూతన ఎపిసోడ్ల విశేషాలను పంచుకుంటూ ప్రధాన నటులు అబ్రర్ కాజీ, ప్రియాన్షి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే ఎపిసోడ్లలో కథ కీలక మలుపు తిరుగుతుందని, ఉత్కంఠభరితమైన నాటకీయ పరిణామాలు ఉంటాయని నటీనటులు వెల్లడించారు.