స్వాతంత్ర్య సమరయోధురాలు పొణకా కనకమ్మ వర్ధంతి ఘన నివాళి
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడులో ధీరవనిత పొణకా కనకమ్మ 64వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సంగ్రామం కోసం ఆమె తన బంగారు నగలను, 13 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి సర్వం త్యాగం చేశారని కోఆర్డినేటర్ పందిపాటి జనార్దన్ రెడ్డి కొనియాడారు. నగరంలో కనకమ్మ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆశ్రమ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.