టాలీవుడ్, కోలీవుడ్లో విషాదం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
రిపోర్టర్: సతీష్
స్థలం: చెన్నై
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు.